ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న సగానికి పైగా థియేటర్లు ఆల్రెడీ అల్లు అరవింద్ అండర్ ఉన్నాయన్న విషయం తెలిసిందే. మరి తండ్రి బిజినెస్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడో లేక అందులో భాగమవ్వాలనుకుంటున్నాడో తెలియదు కానీ.. అల్లు అర్జున్ త్వరలోనే “A A A” అనే పేరుతో ఓ మల్టీప్లెక్స్ ను మొదలెట్టానున్నాడు. మొన్నటివరకు కేవలం ఆలోచనలోనే ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు మహేష్ బాబు “ఎ.ఎం.బి సినిమాస్”ను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడంతో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో తన స్వంత మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేయనున్నాడని సమాచారం. అందుకోసమే సత్యం థియేటర్ ను బెస్ట్ ప్లేస్ గా ఎంచుకున్నాడు అల్లు అర్జున్.
ఇకపోతే.. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. పైగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అనుకున్న సినిమాను ఇప్పటికీ కన్ఫర్మ్ చేయడం లేదు. ఈ రెండూ సరిపోవన్నట్లు విక్రమ్ కుమార్ సినిమాని రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆయన నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.