నెగటివ్ షేడ్స్ లో బన్నీ

  • June 4, 2016 / 10:21 AM IST

ఊర మాస్ అంటూ “సరైనోడు” ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ్ భాషల్లోనూ ఈ చిత్రం డబ్ అయి అక్కడ కూడా మంచి కలక్షన్లు రాబట్టుకుంది. తన పరిధి ఇతర భాషల్లో విస్తరించాలనే కోరికని ఈ సినిమా నెరవేర్చింది. దీంతో తమిళం, తెలుగు భాషల్లో చిత్రాన్ని చేసే దిశలో బన్నీ అడుగులు వేస్తున్నాడు. ఇందుకోసం తమిళ దర్శకుడు లింగు స్వామిని ఎంచుకున్నాడు. ఇతను ఇదివరకు కమల్ హాసన్ తో ఉత్తమ విలన్ సినిమా తీసాడు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పాడు.

ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలు అల్లు అర్జునే చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇది వరకు విలక్షణ నటుడు కమల్ హాసన్ భారతీయుడు, అభయ్ చిత్రాల్లో రెండు పాత్రలను చక్కగా పోషించారు. ఆ తర్వాత రజనీ కాంత్ రెండు షేడ్స్ పాత్రలను రోబోలో చేసి శెభాష్ అనిపించుకున్నారు. అయినా తెలుగు హీరోలు ఈ సాహసం చేయలేదు. లేటస్ట్ గా “24” మూవీలో సూర్య విలన్, హీరోగా మెప్పించాడు. త్వరలో విడుదల కానున్న జెంటిల్ మాన్ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు ఆడియో వేడుకలో స్వయంగా నాని తెలిపాడు. ఇలా యువ హీరోలు ఈ ప్రయోగం చేయడానికి ముందుకు వస్తున్నారు.

లింగు స్వామి దర్శకత్వంలో వచ్చే మూవీలో ఒకటి మంచి పాత్ర అయితే, రెండోది క్రూరంగా ఉండబోతోంది. ఈ పాత్రల్లో తన ప్రతిభను చాటుకోవాలని స్టైలిస్ట్ స్టార్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదివరకు ఆర్య 2 చిత్రంలో ఒకరకమైన సాడిస్ట్ పాత్ర ద్వారా అద్భుత నటన కనబరిచిన బన్నీ రానున్న సినిమాలో నట విశ్వరూపం చూపించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus