Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

టాలీవుడ్ హీరోలకు వెయ్యి కోట్ల మార్క్ అంటే అది కేవలం రాజమౌళికే సాధ్యమని ఒకప్పుడు అంతా అనుకునేవారు. కానీ ‘పుష్ప 2’ సినిమాతో ఆ థియరీని అల్లు అర్జున్ తుడిచిపెట్టేశారు. ఏకంగా 1780 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన బన్నీ, ఇప్పుడు తన నెక్స్ట్ మూవీస్ కోసం ఒక పక్కా గ్లోబల్ మాస్టర్ ప్లాన్ వేశారు. జక్కన్న తోడు లేకుండానే తన సొంత క్రేజ్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు ఆయన రెడీ అయిపోయారు.

Allu Arjun

బన్నీ సెలెక్ట్ చేసుకుంటున్న డైరెక్టర్ల లిస్ట్ చూస్తుంటేనే ఆయన విజన్ ఏంటో అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో ఇంటెన్సిటీ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో కలిసి చేయబోయే సినిమాపై ఇప్పటికే అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ క్రేజీ కాంబో కోసం నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

వీటన్నింటికంటే హాట్ టాపిక్ ఏంటంటే ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు బన్నీ లైనప్‌లోకి రావడం. గతంలో వీరిద్దరూ కలిసి ఒక సూపర్ హీరో మూవీ ప్లాన్ చేసినా, అది కాస్తా హోల్డ్‌లో పడింది. కానీ ఇప్పుడు ఆదిత్య ధర్ ఒక టెర్రిఫిక్ సబ్జెక్ట్‌తో బన్నీని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కనుక సెట్స్ పైకి వెళ్తే, అల్లు అర్జున్ మార్కెట్ బాలీవుడ్‌లో మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం. మైథాలజీ టచ్ ఉన్న మోడరన్ స్టోరీ అని ఇండస్ట్రీ టాక్.

అల్లు అర్జున్‌కు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆయన స్క్రిప్ట్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. కథలో మ్యాటర్ ఉంటేనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అట్లీ, లోకేశ్, సందీప్ రెడ్డి వంగా.. వీళ్లంతా ఇప్పుడు బాక్సాఫీస్ బిగ్ డైరెక్టర్లే. వీరితో బన్నీ చేసే ప్రతి సినిమా మినిమం వెయ్యి కోట్ల బిజినెస్ గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా, వసూళ్ల లెక్క 2000 కోట్లను దాటే ఛాన్స్ ఉంది. బన్నీ తన పెర్ఫార్మెన్స్‌తో పాటు డైరెక్టర్లను ఎంచుకునే మెచ్యూరిటీతో ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఐకాన్ స్టార్ ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus