సొంత ఆఫీస్ పెట్టుకున్న అల్లు అర్జున్

  • September 25, 2018 / 07:38 AM IST

కొత్త దర్శకులు అద్భుతాన్ని సృష్టిస్తున్నారని వక్కంతం వంశీ కి అల్లు అర్జున్ అవకాశం ఇచ్చారు. అతని దర్శకత్వంలో వచ్చిన “నా పేరు సూర్య” సినిమా అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తున్నారని తెలుసుకోవాలని ఫాన్స్ లో ఆరాటం పెరిగింది. దీంతో రకరకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. తన నెక్స్ట్ సినిమా విషయంలో అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. “మై డియర్ ఫ్యాన్స్… నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండండి. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంత సమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అని గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

మొన్నటి వరకు కుటుంబంతో కలిసి విహరించిన బన్నీ.. నేటి నుంచి సినిమా పనుల్లో బిజీ కానున్నారు. అతను అధికారికంగా ప్రకటించకపోయినా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలోనే నటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అందుకోసం బన్నీ కొత్త ఆఫీస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇదివరకు గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌నే తన ఆఫీస్‌గా వినియోగించుకున్నఅల్లు అర్జున్ తాజాగా జూబ్లీ హిల్స్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు. ఇక మీదట తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ డిస్కషన్స్‌, ఇతర పనులు ఈ ఆఫీస్‌ నుంచే చేయనున్నారని సమాచారం. కొత్త ఆఫీస్ అల్లు అర్జున్ సినీ కెరీర్ కి ఎంతమేర కలిసి వస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus