Allu Ayaan: బన్నీ కొడుకు ట్యాగ్ ఏంటో తెలుసా.. భలే ట్యాగ్ ఫిక్స్ చేశారుగా!

  • April 4, 2024 / 09:24 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే. బన్నీకి ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ అని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే బన్నీ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాలు రీరిలీజ్ అవుతున్నట్టు వార్తలు వచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలు వాయిదా పడ్డాయని తెలుస్తోంది. బన్నీ పుట్టినరోజు కానుకగా పుష్ప ది రూల్ (Pushpa 2)  సినిమా టీజర్ మాత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని భోగట్టా.

బన్నీ కొడుకు అయాన్ కు సైతం ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. అయితే అల్లు అయాన్ కు ఇప్పటికే ట్యాగ్ కూడా ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అల్లు అయాన్ కు నాటీ స్టార్ అనే ట్యాగ్ ఉంది. బన్నీ స్వయంగా కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నాటీస్టార్ అని ప్రస్తావించడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

బన్నీ కొడుకుకు భలే ట్యాగ్ ఫిక్స్ చేశారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బన్నీ సినిమాలతోనే అయాన్ కూడా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు. కొడుకుతో కలిసి బన్నీ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బన్నీ పుట్టినరోజు కానుకగా కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించి స్పష్టత వస్తుందేమో చూడాలి.

అల్లు అర్జున్ తో సినిమా చేయాలని భావించే దర్శకులు చాలామంది ఉన్నారు. ఆ దర్శకులలో బన్నీ ఛాయిస్ ఎవరనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది. బన్నీ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలకు మించి ఉందని కొన్ని సినిమాలకు బన్నీ లాభాల్లో వాటా అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ వేగంగా సినిమాల్లో నటించాల్సి ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తే బన్నీ కెరీర్ కు నష్టం కలుగుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus