ఒక్కో స్పెషల్ డే నాడు ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తున్న అల్లు అర్జున్

Advertisement

రచయితగా హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి.. దర్శకత్వం వహిస్తున్న ‘నా పేరు సూర్య’ .. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే బెస్ట్ ఇంపాక్ట్ అందుకుంది. ఇందులో యాంగ్రీ సోల్జర్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించనున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టుడియోస్ లో జరుగుతోంది. పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ ను బన్నీపై షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత మరో 25రోజుల షూట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. దాంతో ప్రొడక్షన్ కంప్లీట్ కానుంది. శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ లు సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే. వారు స్వరపరిచిన పాటల్లో “సైనికా” అనే పాటని గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఈ పాట సైనికుల గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఉండనుంది. ఆ పాటతో పాటు మరో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఆ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఇది ప్రేమ గీతమని తెలిసింది. ఇలా ఒక్కో స్పెషల్ డే నాడు అందుకు రిలేట్ అయ్యే సాంగ్ రిలీజ్ చేసి సినిమాకి అభిమానులు కనెక్ట్ అయ్యేలా అల్లు అర్జున్ చేస్తున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత బన్నీ చేస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మళయాలం, భోజ్ పురి, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus