అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో బాలీవుడ్ రీమేక్

  • October 22, 2018 / 11:02 AM IST

“అరవింద సమేత వీరరాఘవ” విడుదల అనంతరం త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తోనే చేయనున్నాడనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అల్లు అర్జున్ తో ఇదివరకు “జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి” చిత్రాలను నిర్మించిన హారిక & హాసిని సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. అయితే.. తన మునుపటి చిత్రాలైన “అ ఆ, అజ్ణాతవాసి, అరవింద సమేత” చిత్రాలకు త్రివిక్రమ్ కాపీ కొట్టాడు అని అభాండాలు ఎదుర్కొన్న క్రమంలో ఈసారి డైరెక్ట్ గా ఓ బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “సోనూ కీ టిట్టూ కా స్వీటీ” అనే సినిమా రీమేక్ రైట్స్ ను కొనుక్కొన్నాడట. ఈ ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ హిందీలో భీభత్సంగా ఆడింది. ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒకమ్మాయి వచ్చి వారి జీవితాలను ఎలా మార్చింది అనేది సినిమా కథాంశం. మల్టీస్టారర్ గా తీయడానికి స్కోప్ ఉన్న ఈ సినిమాను ఇద్దరు హీరోలతో తెరకెక్కించాలనుకొంటున్నాడట త్రివిక్రమ్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ నిజంగా ఆ సినిమాను రీమేక్ చేస్తే మాత్రం తప్పకుండా మంచి హిట్టే కొడతాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus