గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని డైరక్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టోరీ సిట్టింగ్ పూర్తి అయింది. సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత పవర్ స్టార్ తో సినిమా చేయాలనీ ఏడాది పాటు హరీష్ ఎదురుచూశాడు.
కుదరక పోవడంతో ఆ అవకాశం అల్లు అర్జున్ కు దక్కింది. ప్రస్తుతం బన్నీతన భార్య స్నేహతో కలిసి టర్కీలో వేసవి సెలవులను గడుపుతున్నాడు. అక్కడ నుంచి రాగానే లింగుస్వామి దర్శకత్వంలో తమిళం, తెలుగులో ఒకేసారి చిత్రీకరణ జరుపుకోనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఈ సినిమా తర్వాత ముందుగా అనుకున్నట్లు విక్రమ్ కె కుమార్ తో సినిమా చేస్తాడా ? లేదా తాజా నిర్ణయాల ప్రకారం హరీష్ శంకర్ ప్రాజక్ట్ లో నటిస్తాడా? అన్నది తేలాల్సి ఉంది.