స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు రికార్డులను తానే తిరగరాయాలని ఆలోచిస్తున్నాడు. అందుకే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దువ్వాడ జగన్నాథమ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీని జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. స్పైడర్ రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో భారీ కలెక్షన్లు అందుకోవచ్చని అనుకున్నారు. కానీ డీజె ఆశలపై సల్మాన్ ఖాన్ నీళ్లు చల్లాడు. అతను హీరోగా తెరకెక్కిన ట్యూబ్ లైట్ సినిమాను ఈద్ కానుకగా జూన్ 23న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలోను ట్యూబ్ లైట్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న డీజే కలెక్షన్లపై ప్రభావం తప్పకపడుతుంది. ఇదే ప్రస్తుతం డీజే బృందాన్ని కలవరపెడుతోంది. హైదరాబాద్ లో తప్ప తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో సల్మాన్ ఖాన్ సినిమాని చూసే వారు తక్కువని బన్నీ అభిమానులు చెబుతున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సల్మాన్ ఖాన్ సినిమాని పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు. అందుకే డీజేపై ట్యూబ్ లైట్ ప్రభావం ఏ మాత్రం ఉండదని, బన్నీకి మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.