అనేక రకాల కథలు వింటున్న అల్లు అర్జున్!

  • October 4, 2018 / 04:46 AM IST

అల్లు అర్జున్ కి తోటి హీరోలైన రామ్ చరణ్ రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎన్టీఆర్ నాలుగు విజయాలు అందుకొని మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ అయితే హ్యాట్రిక్ తో దూసుకుపోతున్నారు. అందుకే స్టైలిష్ స్టార్ కి ఇప్పుడు ఒక్క హిట్ కావాలి. అలాంటి.. ఇలాంటి హిట్ కాదు.. సరైన హిట్ కావాలి. సరైనోడు లాంటి కలెక్షన్లు తెచ్చే సినిమా కావాలి. అందుకే  చాలా జాగ్రత్తగా కథలు వింటున్నారు. ప్రత్యేకంగా ఆఫీస్ ని ఓపెన్ చేసి మరీ విభిన్న కథలను వింటున్నారు. విక్రమ్ కె కుమార్ చెప్పిన కథకు ఒకే చెప్పినప్పటికీ అంతకు మించి కథ ఏమైనా దొరుకుతుందేమోనని తనకి పరిచయం ఉన్న మారుతి, ప‌ర‌శురామ్‌ లతో పాటు.. కొత్త ద‌ర్శ‌కుల కథలను సైతం వింటున్నారు.

రీసెంట్ గా ఇంద్ర‌గంటి మోహన్ కృష్ణ కూడా బ‌న్నీకి ఓ క‌థ వినిపించాడ‌ని తెలిసింది. క‌థ బ‌న్నీకి బాగా నచ్చినప్పటికీ.. చేయాలా? వద్దా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. అలాగే “గ‌రుడ వేగ‌”తో హిట్టు అందుకున్న ప్ర‌వీణ్ స‌త్తారు కూడా బ‌న్నీకి ఓ లైన్ చెప్పారంట. అయితే దీనిపై కూడా బ‌న్నీ ఇంకా ఓ నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మరి ఎవరి కథని ఓకే చేస్తారో… ఎటువంటి కథతో వస్తారోనని అభిమానులు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus