“దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య” రిజల్ట్స్ అనంతరం అల్లు అర్జున్ కి తన డెసిషన్ మీద నమ్మకం పోయిందా లేక ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. అందుకు కారణం ఆయన సినిమాల ఎంపిక. త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా క్లారిటీ రాకుండానే సుకుమార్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమా తర్వాత మురుగదాస్ తో సినిమా అని టాక్. ఇవి కాకుండా మరో రెండు ప్రొజెక్ట్స్ లైన్ లో ఉన్నాయని కూడా టాక్.
అయితే.. ఇప్పటివరకూ త్రివిక్రమ్ సినిమానే మొదలెట్టలేదు. సుకుమార్ సినిమా ఎప్పటినుండి అనేది ఇంకా క్లారిటీ లేదు. పైగా.. ఇప్పటివరకూ ఈ రెండు సినిమాల కథలు ఇంకా ఫైనల్ అవ్వలేదు. మరి ఇంత కన్ఫ్యూజన్ లో ముందు ఏదో ఒక సినిమా మొదలెట్టకుండా ఇలా సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సేఫ్ అనేది అర్జున్ ఆలోచించాలి. ఇదివరకు కూడా లింగుస్వామి ప్రొజెక్ట్ ను ఇలాగే ఎనౌన్స్ చేశారు. కట్ చేస్తే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. మరి ఈ సినిమాల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.