అల్లు అర్జున్ సరికొత్త ట్విస్ట్!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..అయితే అదే క్రమంలో మెగా ఫ్యామిలీలో సైతం కాస్త ఇబ్బందులు తలెత్తే సన్నివేశాలు చాలా జరగడంతో హీరోల్లో చీలిక వచ్చింది అన్న భావం బయటకు కనిపిస్తూనే ఉంది…అయితే మెగా కాంపౌండ్ ఎప్పటికప్పుడు వాటిని ఖండించుకుంటూ వస్తూనే ఉంది…అయితే కొన్ని సార్లు వారి మధ్య విభేదాలు బయటపడటంతో అందరికీ అర్ధం అయిపోయింది..మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అని..ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ సరికొత్త ప్లాన్ తో తన అభిమాన గళాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ మెగా హీరోలు అంతా మెగా…పవర్ స్టార్ ఫ్యాన్స్ పైనే ఆధారపడి చలామణీ అయిపోతున్నారు అన్న రూమర్ ఉండడంతో బన్నీ సరికొత్త వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం….వివరాల్లొకి వెళితే…ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం కొద్ది రోజుల క్రితం అల్లుఅర్జున్ తన గీత ఆర్ట్స్ ఆఫీసులో మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన తన అభిమానలను కొందరిని ఎంపికచేసి వారిని హైదరాబాద్ లోని తన ఆఫీసుకు పిలిపించడమే కాకుండా తాను ఎటువంటి పాత్రలు భవిష్యత్తులో ఇంకా చేస్తే బాగుంటుంది అన్న విషయమై అభిప్రాయ సేకరణ చేసినట్లు టాక్.

అదేవిధంగా రానున్న రోజులలో తన అభిమానులను కొన్ని సామాజిక కార్యక్రమాలను కూడ చేయవలసిందిగా అల్లుఅర్జున్ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ సారాంశం ఏమైనా…బన్నీ శిరీష్ విషయం కూడా ఇక్కడ ప్రస్తావించినట్లు సమాచారం….అదేమిటంటే..ఇక నుంచి తన అభిమానులు అదేవిధంగా శిరీష్ అభిమానులు తరుచూ తన బావమరిది తో టచ్ లో ఉండమని సంకేతాలు ఇచ్చినట్లు టాక్.  దీనితో మెగా అభిమానుల వ్యవహారాలు చూసే నాగబాబుకు పోటీగా మరొక వ్యక్తిని అల్లు అర్జున్ ప్రోత్సహిస్తున్నాడా అన్న ఆలోచన బలంగా కనిపిస్తుంది….ఏది ఏమైనా…ఈ కలయిక ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus