బన్నీ కూడా చిరు కధనే చేస్తున్నాడా??

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హంగామా మామూలుగా లేదు….మెగా శిబిరం నుంచి రోజుకో హీరో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇప్పటికీ ఇండస్ట్రీలో పాతుకు పోయిన మెగా హీరోలు తమ భలాన్ని ఇంకా పెంచుకునే అందుకు ఆలోచనలో ఉన్నారు….ఇప్పటికీ ఈ ఫ్యామిలీ హీరోగా సెటిల్ అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధం’ అన్న సినిమాని చేస్తున్నాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమా కధపై అనేక పుకార్లు టాలీవుడ్ లో రోజుకొకటి షికారు చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కధ విషయానికి వస్తే…దువ్వాడ నుంచి సిటీకి వచ్చిన ఒక యువకుడు డ్యాన్స్ జాకీగా ఎలా మారతాడు? అందరిచేత డీజే గా ఎలా పిలిపించుకుంటాడు? అనే మెయిన్ పాయింట్ తో అల్లుకున్న కధ ఇది…..అదే క్రమంలో ఈ సినిమాలో అప్పట్లో మెగాస్టార్ నటించిన ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ కధని బేస్ పాయంట్ గా తీసుకున్నట్లు సమాచారం.

ఇక మరో పక్క…. మాస్ కథలను సెటైరికల్ గా తీస్తాడు అని పేరున్న హరీష్ శంకర్ స్వతహాగా చిరంజీవి పవన్ ల వీరాభిమాని కాబట్టి ఇలా చిరంజీవి సినిమాకు ప్రీమేక్ గా ఈ ‘డిజే’ ను మారుస్తున్నాడు అనుకోవాలి.  ఈసినిమాలో బన్నీ చేయబోయే డాన్స్ లు చాల డిఫరెంట్ గా ఉండటానికి ఆ డాన్స్ స్టెప్స్ ను వెరైటీగా డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఏది ఏమైనా…ఒక పక్క చెర్రీ….’జగదేక వీరుడు – అతిలోక సుందరి’ మూవీ రీమేక్ లో నటిస్తాడు అన్న వార్తలు వస్తూ ఉన్న తరుణంలో ఇప్పుడు బన్నీ చిరు కధనే ఎంచుకోవడం చూస్తూనే మెగాస్టార్ అందరికీ ఇన్స్పిరేషన్ అన్న పధానికి అర్ధం ఇట్టే అర్ధమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus