‘చెప్పను బ్రదర్’-.బన్నీ

  • May 7, 2016 / 10:23 AM IST

ఇటీవలే సరైనోడు సక్సెస్ మీటింగ్ విజయవాడలో జరగగా.. ఈ మీటింగ్ లో అల్లు అర్జున్ చెప్పిన పదం పవన్ కళ్యాణ్ అభిమానులకు అంతగా రుచించడం లేదు. ఈ కార్యక్రమంలో సరైనోడు విజయం కోసం కష్టపడిన చిత్ర బృందం లోని ప్రతిఒక్క సభ్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బన్నీ తెలిపారు. అయితే ఇంతలో అభిమానులు పవన్ గురించి చెప్పాలని చెప్పగా.. ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ రిప్లే ఇచ్చాడు. దీంతో పవన్ అభిమానులు బన్నీ పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా..

గతంలో తాను పవన్ గురించి చెప్పిన వ్యాఖ్యలను ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ‘చెప్పను బ్రదర్’ అన్న పదంపై పలు సెటైరికల్ డైలాగ్స్ తో ట్విటర్ లో తమ భావాలను సినీ అభిమానులు పంచుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus