దువ్వాడ జగన్నాధం ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన హరీష్ శంకర్

  • February 11, 2017 / 09:53 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాథమ్ వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  పతాకంపై  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో బన్నీ సరసన ముకుంద ఫేమ్ పూజ హెగ్డే నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ని శివరాత్రికి రిలీజ్ చేయడానికి డైరక్టర్ సిద్ధమవుతున్నారు. డీజే కోసం రాక్ స్టార్ దేవీ ప్రసాద్ అదిరిపోయే పాటలను అందించారు. ఈ ఆడియో రిలీజ్ వేడుకను  ఏప్రిల్ 16న వైభవంగా నిర్వహించాలని చిత్ర బృందం డిసైడ్ అయింది. సరైనోడు చిత్రానికి ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు.

ఈ సారి గ్రాండ్ గా చేయాలనీ నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ పై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.  మే 19 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న రిలీజ్ అవుతుంది. ఆ చిత్ర ఎఫెక్ట్ రెండువారాలపాటు బలంగా ఉంటుంది. మూడో వారానికి థియేటర్లు దొరికే అవకాశం ఉండడంతో అప్పుడు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ తేదీలపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus