బన్నీ 21వ చిత్రంపై క్లారిటీ వచ్చేసిందిగా

Advertisement

లక్ అంటే దర్శకుడు శ్రీరామ్ వేణుదే. ఆయన ట్రాక్ రికార్డు అంతగా బాగోకపోయిన స్టార్ హీరోలతో సినిమాలు పట్టేస్తున్నాడు. 2011లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటిగా సిద్దార్ధ్, శృతి హాసన్ జంటగా ఓ మై ఫ్రెండ్ చిత్రాన్ని తెరక్కెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ ఇచ్చిన షాక్ తో మళ్ళీ డైరెక్టర్ గా ఆరేళ్ళ తరువాత 2017లో నాని హీరోగా ఎమ్ సి ఏ తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. మూడవ చిత్రంగా వేణు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఐకాన్ అనే మూవీ ఒకే చేయించారు. కొద్దిరోజులలో సెట్స్ పైకి వెళుతుంది అనుకున్న తరణంలో ఈ మూవీ హోల్డ్ లో పడింది. నాపేరు సూర్య సినిమా పరాజయం తరువాత సందిగ్ధంలో పడ్డ బన్నీ సేఫ్ సైడ్ గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎంచుకొని, వేణు ప్రాజెక్ట్ పక్కన పెట్టారు.

అల వైకుంఠపురంలో మూవీ తరువాత కూడా బన్నీ సుకుమార్ మూవీ ప్రారంభించడంతో ఐకాన్ ఇక అటకెక్కినట్లే అనుకున్నారు. ఐతే ఈ ప్రాజెక్ట్ 2021లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు హింట్ దొరికింది. నేడు ఐకాన్ చిత్ర యూనిట్ బన్నీకి బర్త్ డే విషెష్ చెవుతూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. దీనితో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐకాన్ అని అర్థం అయిపోయింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus