అక్కడ అర్జున్ ఇక్కడ శిరీష్!

  • July 26, 2016 / 10:28 AM IST

ఆల్రెడీ కేరళలో అన్నయ్య అల్లు అర్జున్ మంచి మార్కెట్ సంపాదించుకొని మలయాళ హీరోలకు గట్టి పోటీనిస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకొన్నాడు. అల్లు అర్జున్ సినిమాలకు మంచి డిమాండ్ ఉందక్కడ. ఇటీవల విడుదలైన “సరైనోడు” మలయాళ డబ్బింగ్ వెర్షన్ “యోధ” కూడా ఘన విజయం సాధించింది. దాంతో అల్లు అర్జున్ కేరళలో మలయాళ హీరోలకు పెద్ద తలపోటుగా మారాడు. ఇప్పుడు అన్నయ్యలాగే తమ్ముడు అల్లు శిరీష్ కూడా మలయాళ స్టార్ హీరోకు తలపోటుగా మారాడు.

అదెలా అనుకొంటున్నారా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన “మనమంతా” సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతుండగా.. అదే సమయంలో అల్లు శిరీష్ తన మూడో చిత్రం “శ్రీరస్తు శుభమస్తు”ను విడుదల చేస్తున్నాడు. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో సినిమాతో అల్లు శిరీష్ లాంటి ఇంకా నిలదొక్కుకోవడానికి పాట్లు పడుతున్న యువ కథానాయకుడు పోటీకి దిగుతుండడం అందర్నీ ఆకర్షిస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విజయం తీరానికి చేరుతుందో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus