నందమూరి ఫ్యామిలీ కి మెగా హీరో చెక్..!!

  • August 1, 2016 / 06:45 AM IST

టాలీవుడ్ లో ఎవ్వరు కాదన్నా…అవునన్నా…నందమూరి, మెగా కుటుంబాల మధ్య వైరం నడుస్తూనే ఉంటుంది. అయితే అలాంటి వైరానికి ఆధ్యం పోస్తూ మెగా హీరో ఒకరు నందమూరి వంశంలో హీరోలకి షాక్ ఇస్తున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ పై అఫీషియల్ రైట్స్ ఎన్టీఆర్ ఫ్యామిలీకే ఉంటాయి అని అభిమానుల ఆలోచన.

కానీ, ఆ రైట్స్ ను తన ఖాతాలో వేసుకుని ట్విష్ట్ ఇచ్చాడు మెగా హీరో అల్లు శిరీష్….ఇంతకీ శిరీష్ చేసిన పని ఏంటి అంటే…అప్పట్లో…సీనియర్ ఎన్.టి.ఆర్ కె.వి రెడ్డి గారి దర్శకత్వంలో చేసిన మైథలాజికల్ మూవీ జగదేక వీరుని కథ. ఇక అదే టైటిల్ తో అల్లు శిరీష్ కూడా ఓ సినిమా చేస్తున్నాడట. వేణు మళ్లిడి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్న మన శిరీష్ ఆ సినిమాకు “జగదేక వీరుని కథ” అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కధ చాలా డిఫరెంట్ అట, ఇందులో టూ షేడ్స్ ఉన్న పాత్రల్లో శిరీష్ అందరిని ఆశ్చర్యపరుస్తాడట.

ఇక మెగా క్యాంప్ నుండి జగదేక వీరుని కథ అంటూ రాబోతున్న శిరీష్ నందమూరి హీరోలకు సవాల్ విసురుతున్నాడనే చెప్పాలి. అదే క్రమంలో శ్రీరస్తు…శుభమస్తు అంటూ మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శిరీష్ కి ఈ సినిమా ఎంతవరకూ కలసి వస్తుందో ఏమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus