గాయకుడిగా అల్లు శిరీష్..!

Advertisement

యువ దర్శకుడు ప‌రుశురామ్ తెరకెక్కించిన “శ్రీరస్తు శుభమస్తు” చిత్రం ద్వారా అల్లు శిరీష్ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కుటుంబ కథాచిత్రం గా అందరినీ ఆకట్టుకుంటూ సూపర్ హిట్ దిశగా దూసుకు పోతోంది.

ఈ చిత్రంలోని పాటలన్ని హిట్టే. ‘అను అను” పాట అయితే యువత మనసును కదిలించింది. శిరీష్ కు కూడా ఈ సాంగ్ నచ్చడంతో  కవర్ వెర్షన్ ను ఎంతో ఫీల్ తో పాడారు. హీరో గొంతు నుంచి వచ్చిన ఈ సాంగ్ అమ్మాయిల మనసు దోచుకుంది. దీంతో అల్లు శిరీష్ హీరో గానే కాకుండా గాయకుడిగా కూడా మంచి మార్కులు కొట్టేసాడని సినీ ప్రముఖులు చెబుతున్నారు. సంగీత దర్శకులైతే అతని తర్వాత మూవీలో ఒక పాట పాడించేందుకు సిద్ధమైపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news