అటువంటి అమ్మాయిలు నటిగా రాణించలేరు : అమలా పాల్

  • July 20, 2018 / 09:25 AM IST

సినిమా పరిశ్రమలో నటీమణులను లైంగికంగా వేధిస్తున్నారని కొంతకాలంగా చర్చ సాగుతోంది. దీనిపై కొంతమంది హీరోయిన్స్ పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. తాజాగా అమలాపాల్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ప్రేమ ఖైదీ సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమయిన ఈ బ్యూటీ… ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, నాయక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మానసికంగా ధైర్యంగా లేని అమ్మాయిలు సినిమా రంగంలోనే కాదు ఏ రంగంలోనూ రాణించలేరు. కొందరు ఉద్యోగిణులకు కూడా ఈ సమస్య కచ్చితంగా ఎదురవుతుంది. సినిమా రంగంలో ఇది మరికొంచెం పెద్ద సమస్య. అయితే ధైర్యంగా, సూటిగా అభిప్రాయాలను వ్యక్త పరచడం, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లడం, మన నిర్ణయం మీద కచ్చితంగా నిలబడగలగడం వంటి లక్షణాలతో లైంగిక వేధింపులను ఎదుర్కోవచ్చు. మానసికంగా ధైర్యంగా లేని అమ్మాయిలు సినిమాలకు పనికిరారు” అని అమలాపాల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమిళం, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి మంచి కథ కోసం ఎదురుచూస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus