ఏం పెళ్లైపోతే అందుకు పనికిరానా??

  • November 15, 2017 / 06:17 AM IST

“కొడుకు మీసం కత్తిరిస్తే.. తండ్రి ముసలోడైనట్లు” అన్నట్లు.. హీరోయిన్ కి పెళ్లైతే ఆంటీ అయిపోయినట్లేననే సిద్ధాంతాన్ని గత రెండు దశాబ్ధాలుగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ అనే భాషా బేధం లేకుండా అన్నీ ఇండస్ట్రీలు ఫాలో అవుతున్న రూల్. ఈ రూల్ ను బ్రేక్ చేసి పెళ్లాయ్యాక కూడా సినిమాల్లో హీరోయిన్ గా రాణించడం కోసం మాలాశ్రీ, శ్రీదేవి వంటి వంటివారు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆ ప్రయత్నాలు బెడిసికొట్టడమే కాదు చాలా దారుణమైన రిజల్ట్స్ వచ్చాయి. మన దర్శకనిర్మాతలు కూడా ఆ రూల్ ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారంతే.

అయితే.. ఇప్పుడు ఆ రూల్ ను బ్రేజ్ చేస్తానంటుంది డస్కీ బ్యూటీ అమలాపాల్. తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లాడి, అత్తమామలతో తలెత్తిన సమస్యల కారణంగా విడాకులు తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన అమలా కొన్నిరోజులపాటు రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ ప్లే చేసినప్పటికీ ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో.. “ఏం పెళ్లైనంత మాత్రానా గ్లామర్ రోల్స్ కి పనికిరానా?” అంటూ ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచింది. ఆమె తాజా చిత్రం “దొంగోడొచ్చాడు” పోస్టర్ చూస్తుంటే.. “అబ్బో అమలాపాల్ ఎక్కడా ఆగేలా లేదుగా” అంటూ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరి అమ్మడు ఆరబోస్తున్న అందాలు, ఇస్తున్న ఫోజులు కూడా అలానే ఉన్నాయిలెండి. మరి అమల ఇంతలా రెచ్చిపోయి మరీ చేసిన ఎక్స్ పోజింగ్ ఆమె కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ.. జనాలు మాత్రం ఆమె అందాలను ఆత్రంగా ఆరగిస్తూ సంతుష్టులవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus