డస్కీ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్

దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తో విడాకుల అనంతరం గ్లామర్ డోస్ పెంచడంతోపాటు సినిమాల జోరు కూడా పెంచిన అమలాపాల్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. సాధారణంగా యంగ్ హీరోయిన్స్ కి అది కూడా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వచ్చే బాలీవుడ్ ఆఫర్ అమలాపాల్ ని వెతుక్కుంటూ వచ్చింది. బాలీవుడ్ పాపులర్ నటుల్లో ఒకడైన అర్జున్ రామ్ పాల్ కథానాయకుడిగా నరేష్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అమలాపాల్ ను కథానాయికగా ఎంపిక చేశారు.

ఇటీవల అమలాపాల్ నటించిన తమిళ చిత్రం “తిరుట్టు పయలే 2″లో అమ్మడి నడుమందాలు పెను ప్రకంపనలు సృష్టించాయి. అలా వైరల్ అయిన నడుమందాలే ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఆఫర్ తెచ్చిపెట్టడంలో కీలకపాత్ర పోషించాయి. ఆ నడుమందాలతోపాటు అమలాపాల్ సెక్సీ లుక్స్ చూసి నరేష్ మల్హోత్రా ఈ ఆఫర్ ను అమలాపాల్ కి ఇచ్చాడట. అలాగే ఇంకాస్త సన్నగా సెక్సీగా తయారవ్వమని కూడా చెప్పాడట. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా సన్నబడేందుకు కసరత్తులు మొదలెట్టిందట అమలాపాల్.

ఈ చిత్రంలో అమలాపాల్ సెక్సీ హౌస్ వైఫ్ గా కనిపించనుందని తెలుస్తోంది. అర్జున్ రామ్ పాల్ వైఫ్ పాత్రలో అమలాపాల్ కనువిందు చేయనుంది. మరో రెండు నెలల్లో ఈ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus