బాలకృష్ణ సాహసాన్ని మెచ్చుకున్న అమితాబ్ బచ్చన్

  • October 19, 2016 / 01:45 PM IST

టాలీవుడ్‌ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణను బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ అభినందించారు. చారిత్రక నేపథ్యం కలిగిన గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సినిమాను చేస్తున్నందుకు బాలయ్యను ప్రశంసించారు. బిగ్‌బి మాటలకు బాలకృష్ణ  చాలా సంతోషించినట్లు తెలిసింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘సర్కార్ 3’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమయింది.

ఈ షూటింగ్ స్పాట్ కి బాలకృష్ణ చేరుకొని అమితాబ్ తో కాసేపు మాట్లాడారు. తన వందో చిత్రం విశేషాలను చెప్పారు. ఆ సినిమా కథ గురించి విన్న బిగ్ బి బాలకృష్ణ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. వీరు కలిసి ముచ్చటించుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అమితాబ్ తో మాట్లాడిన తర్వాత కాసేపు వర్మ, ఇతర నటీనటులతో మాట్లాడి తన చిత్రం షూటింగ్ కోసం జరుగుతున్న మధ్యప్రదేశ్ కి తిరిగి వెళ్లారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus