టాలీవుడ్‌లో తాజాగా జరిగిన మోస్ట్ అవైటెడ్ వివాహం విజయ్ దేవరకొండ – రష్మికల పెళ్లి . గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ బంధంతో కలిసి ఉన్న ఈ జంట, ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ITC మెమెంటోస్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ శుభసందర్భంలో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, “ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లినా అభిమానులు, వదిన ఎలా ఉన్నారు? అని అడిగితే సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. కానీ ఈ రోజు ఎంతో దయగల, పాజిటివ్ వ్యక్తి మా కుటుంబంలోకి వదినగా వచ్చారు అంటూ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల హృదయాలను తాకాయి. అన్నయ్య – వదిన ఇద్దరూ జీవితాంతం నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాసుకొచ్చారు ఆనంద్.
విజయ్ – రష్మిక పరిచయం మొదటసారిగా వీరిద్దరూ కలిసి నటించిన ‘గీతగోవిందం’ సినిమా సమయంలో మొదలై, ఆ తర్వాత ఆ స్నేహమే ప్రేమగా మారి ఇరువురిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత వీరి కాంబోలో ‘డియర్ కామ్రెడ్’ రాగా, అప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు వినిపించినా, ఎప్పుడూ మౌనం పాటించిన ఈ జంట చివరకు పెళ్లితో తమ ప్రేమకు ముద్ర వేసింది. మార్చి 4న హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట.