ఖరదైన కారు కొనుగోలు చేసిన యాంకర్..!

  • March 31, 2016 / 08:36 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు యాంకర్లు.. హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అటువంటి వారిలో ముందుగా వినిపించే పేరు అనసూయ. ఈమె ప్రస్తుతం ఖరీదైన ఆడి క్యూ 7 ను కొనుగోలు చేసిందని టాక్. ఓ ప్రముఖ చానల్ లో వి‌జే గా కెరీర్ ను ఆరంభించిన అనసూయ, ఆ తరువాత మరో ప్రముఖ చానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది.

జబర్థస్త్ లో పొట్టి పొట్టి డ్రెస్సులతో చేసిన యాంకరింగ్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో వెండి తెరారంగ్రేటం చేసిన అనసూయ.. క్షణం ద్వారా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. క్షణం చిత్రం తరువాత ఆమెకు పలు చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నా.. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించడానికి సంసిద్దంగా ఉంది. ఇంతకీ ఆమె కొనుగోలు చేసిన కారు ఖరీదు ఎంతో తెలుసా అక్షరాల రూ.93  లక్షలు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus