త్వరలో పూర్తి గ్లామర్ షో చేయనున్న హాట్ యాంకర్..!

‘జబర్దస్త్’ కామెడీ షో లో తన హాట్ హాట్ అందాలు వలకబోస్తూ కుర్రకారుని సైతం హీటెక్కిస్తోంది ‘అనసూయ భరద్వాజ్’. దాదాపు నాలుగు పదుల వయసు మీద పడుతున్నా సరే.. హాట్ హాట్ అందాలతో… హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అనే రీతిలో… అటు చిత్ర సీమలో కూడా రాణిస్తుంది. ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే వెండితెర మీద ఇప్పటి వరకూ గ్లామర్ షో చేయలేదు అనసూయ.

అయితే ఇప్పుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ చిత్రంలో అనసూయ గ్లామర్ షో తో రెచ్చిపోబోతుందట. జి . నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో అనసూయ పూర్తి మాస్ మసాలాతో గ్లామర్ తారగా అదరగొట్టనున్నట్లు సమాచారం . నాగేశ్వర్ రెడ్డి అంటే గ్లామర్ కు ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదని తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో అనసూయ వీర లెవల్లో రెచ్చిపోవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు .మరి అనసూయ అందాలు సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవుతాయో చూడాలి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus