నన్ను ఆడేసుకుంటున్నారు.. చర్యలు తీసుకోండి ప్లీజ్ : అనసూయ

  • July 22, 2019 / 01:07 PM IST

‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయకు ఎంత క్రేజ్ ఉందో.. ట్రోల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది అనడంలో సందేహం లేదు. ‘జబర్దస్త్’ లో ఆమె ధరించే దుస్తుల దగ్గరనుండీ సోషల్ మీడియాలో ఆమె పెట్టే హాట్ హాట్ ఫొటోలకి ట్రోలింగ్ ఓ రేంజ్లో నడుస్తుంటుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైంలో ఈమె చేసిన కామెంట్స్ కు నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె పేరుతో సోషల్ అశ్లీల పోస్ట్ లు పెడుతూ, బూతు పదజాలం ఉపయోగించి.. ఉన్న అకౌంట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా వాటిని గుర్తించిన ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు సైబర్ క్రైం పోలీసులని ఆశ్రయించి కంప్లైంట్ ఫైల్ చేశారు.

అనసూయ పేరుతో చాలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. అందులో కొన్ని అస్లీల ఫొటోలకి అనసూయ ఫోటోను అతికించి చాలా ఘోరమైన విధంగా వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు కోరారట. ముఖ్యంగా ఇలాంటి అకౌంట్లు పేస్ బుక్ లో అయితే ఉన్నాయి. ఇలాంటి ఫేక్ అకౌంట్ల వల్ల అనసూయ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలుగుతుందని అనసూయ కూడా పోలీసులకు తెలిపారట. అంతేకాదు వీటి వల్ల ఆమె ఇమేజ్ దెబ్బతినే అవకాశం కూడా ఉందని ఆమె కోరినట్టు తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus