నెటిజన్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్…!

  • April 9, 2020 / 01:54 PM IST

అనసూయ… జబర్దస్త్ హాట్ యాంకర్. ఓ పక్క బుల్లితెర పై షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో .. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని కూడా చేస్తుంది. ఇప్పటి వరకూ ఆమె నటించిన సినిమాల్లో దాదాపు అన్నీ మంచి పాత్రలే. బుల్లితెర పై చేసిన గ్లామర్ షో … సినిమాల్లో చెయ్యదు ఈ బ్యూటీ. ‘క్షణం’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘రంగస్థలం’ ‘యాత్ర’ ‘ఎఫ్2’ ‘మీకు మాత్రమే చెప్తా’ వంటి సినిమాలు అన్నీ ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఒక్క ‘విన్నర్’ సినిమాలో చేసిన ఐటెం సాంగ్.. అలాగే ‘కథనం’ అనే చిత్రాలకు మాత్రం అంత రెస్పాన్స్ రాలేదు.ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు ఈమె కొంతమంది నెటిజన్లతో విసికిపోతూ ఉంటుంది. ఈమె పెట్టిన ఏదో ఒక పోస్ట్ కు కొంతమంది అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం..

ఈమె రియాక్ట్ కావడంతో .. అది కాస్త వైరల్ గా మారుతూ ఉంటుంది. ఎప్పటి నుండో ఇలాంటివి మనం చూస్తూనే వస్తున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల ఓ నెటిజన్ …”ఓ పార్టీలో తరుణ్ భాస్కర్ తో కలిసి తాగి గోల చేసారట కదా?” అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ …”నువ్వు ఇంకా పరిణతి చెందినట్లు లేవు. పరిణతి చెంది ఉంటే.. నీకు అసలు నిజం ఏంటో తెలుస్తుంది” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus