అనసూయ ఫోటో చూసి అనుమానం వ్యక్తం చేసిన నెటిజన్

బుల్లితెరపై యాంకర్ గా చేసినా.. వెండితెరపై నటిగా అదరగొట్టినా అనసూయకే చెల్లింది. ఆమె కనిపిస్తే చాలు యువత కళ్ళు ఆర్పడం మర్చిపోతుంది. ఇద్దరి పిల్లల తల్లి అయినప్పటికీ అందాన్ని ఇప్పటికీ అమ్మాయిలా మెయింటైన్ చేయడం ఆమెకే సాధ్యమైంది. రీసెంట్ గా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించిన ఈమె ప్రస్తుతం కథనం లేడీ ఓరియెంటెడ్ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. విజయదశమి సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. “క్షణం” తర్వాత మళ్ళీ అటువంటి రోల్ పోషించబోతున్నందుకు ఆమెను అందరూ అభినందించారు. అయితే ఆ లుక్ కంటే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది. షార్ట్ డ్రస్ లో మతిపోగొడుతోంది.

“లైఫ్ లాంగ్ ఇలా బీచ్‌ను చూస్తూ గ‌డిపేయాల‌ని.. స‌ముద్రాన్ని చూస్తూ పాట‌లు పాడుకుంటూ.. అల‌ల పై డ్యాన్సులు వేసుకుంటూ గ‌డిపేయాలని ఉంది” అంటూ ఆమె పోస్టు ద్వారా తెలిపింది. ఈ ఫోటోకి అనేక కామెంట్స్ వస్తున్నాయి. అందులో ఓ నెటిజన్ మాత్రం విభిన్నంగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. “అంతా బాగానే ఉంది కానీ.. ఒక చిన్న డౌట్.. ఆంటీలు వేసుకునే కాస్ట్యూమ్స్ ఇవేనా..” అంటూ కామెంట్ పెట్టాడు. ఒక్కమాట అంటే చాలు విరుచుకుపడిపోయే అనసూయ.. అతని విమర్శకి ఎటువంటి సమాధానం ఇస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus