గ్లామర్ గర్ల్ కాదు యాక్టర్ అని ప్రూవ్ చేస్తుందట

  • March 29, 2018 / 11:27 AM IST

బుల్లితెర యాంకర్ గానే కాక వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకొన్న అనసూయ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’లో కీలకపాత్ర పోషిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్-సమంత జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్తగా కనిపించనుందనే విషయం తెలిసిందే. ఇప్పటికే అనసూయ ఫోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ కు మేనత్తగా అనసూయ కనిపించనుందట.

అయితే.. అందరూ ఊహిస్తున్నట్లు ఈ చిత్రంలో అనసూయది ఏదో రోమాంటిక్ రోల్ కాదట. చాలా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర సినిమాకి కీలకం కావడంతోపాటు కథలో ముఖ్యమైన మలుపు తిప్పుటుందట. ఆమె అందాలు కూడా సినిమాలో కీలకపాత్ర పోషించనున్నాయట. అనసూయది గడుసు అత్త పాత్రే అయినప్పటికీ ఆమె అందానికి రంగస్థలం గ్రామం మొత్తం దాసోహమవుతూ ఆమె వెనుక తిరుగుతుంటారట. మరి రంగస్థలం గ్రామస్తులతోపాటు థియేటర్లో ప్రేక్షకులు అనసూయ అందాలను ఏమేరకు సాహో అంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus