అసలు అలా ఎలా పిలవాలనిపిస్తుంది!

  • November 27, 2017 / 10:27 AM IST

మామూలు అమ్మాయిలనే పొరపాటున ఎవరైనా “ఆంటీ” అంటే పొరపాటున కూడా అంగీకరించరు. అలాంటిది బుల్లితెర మరియు వెండితెరపై తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తున్న అనసూయను ఆంటీ అంటుంటే ఉరుకుంటుందా చెప్పండి. నిజానికైతే.. ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయను ఆంటీ అనడంలో తప్పు లేదు కానీ.. ఆమె పాపం చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్న ఫిగర్ ను చూశాక కూడా ఆంటీ అన్నామంటే అంతకుమించిన తప్పు మరొకటి ఉండదు.

ఈ విషయమై బాగా సీరియస్ అయ్యింది అనసూయ. ఇటీవల కొందరు కుర్రాళ్ళు ఆమెను చూసి “ఆంటీ” అని సంభోదించారట. దాంతో కస్సుమన్న అనసూయమ్మ వెంటనే కారు దిగి మరీ.. ఏదో చిన్న పిల్లలు “ఆంటీ” అంటే ఉరుకుంటాను కానీ.. గెడ్డాలు పెంచుకు తిరుగుతున్న మీలాంటివాళ్లు కూడా “ఆంటీ” అంటే ఉరుకునేది లేదు అనేసిందట. అనసూయ బాధను అర్ధం చేసుకొన్న ఆ యువకులు సైలెంట్ గా వెళ్లిపోయారట. ప్రస్తుతం “రంగస్థలం, సచ్చింది గొర్రె” చిత్రాల్లో నటిస్తున్న అనసూయ త్వరలోనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసేందుకు సన్నద్ధమవుతోందని వినికిడి. చూస్తుంటే.. ఇప్పుడప్పుడే అనసూయ క్రేజ్ కి బ్రేక్ పడేట్టుగా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus