వింతగా ప్రవర్తిస్తున్న అనసూయ!!!

  • July 11, 2016 / 08:05 AM IST

బుల్లి తెరపై సూపర్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అందాల యాంకర్ అనసూయ తన సోయగాల పరిమళాల పుణ్యమా అంటూ టాలీవుడ్ లో సైతం వరుస ఆఫర్లతో దూసుకుపోయింది కొన్ని రోజులు. తొలుత వరుసగా ఆమెకు నాగ్ సరసన నాగ్ మరదలు గా నటించే అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా సక్సెస్ కావడంతో మరో “క్షణం” సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర సైతం ఆమెను వరించింది. అయితే ఈ రెండు సినిమాలు, ఆ సినిమాల్లో పాత్రలు అనసూయకు భారీ అవకాశాలను తెచ్చిపేడతాయేమో అని అందరూ అనుకున్నారు, కానీ అలా ఏమీ జరగకపోగా ఇప్పుడు అనసూయకు అసలు అవకాశాలే రావడం లేదు దానికి గల కారణం ఏంటి అంటే…..అనసూయ వింత ప్రవర్తన అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

ఇంతకీ ఏం జరిగింది అంటే…వరుసగా రెండు హిట్స్ రావడంతో మంచి ఊపు మీద ఉన్న ఈ భామ తన వద్దకు వచ్చిన దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల గురించి సంప్రదిస్తే ఆ దర్శక నిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా 40 నుంచి 50 లక్షల పారితోషికం కోరడంతో పాటు తన ఎక్స్ పోజింగ్ పై కొన్నికొన్ని వింత కండిషన్స్ పెట్టడంతో ఖంగుతిన్న ఆ సదరు దర్శక నిర్మాతలు ఆమెకు నో చెప్పి మరో భామను సంప్రదించడం మొదలు పెట్టారు. బహుశా అనసూయ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా ఆ ఫార్ములా ఫాలో అవుతున్నట్లు ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus