ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎవరైనా అడుగుపెట్టి సక్సెస్ అయితే.. వాళ్ళ పేరు చెప్పుకుని కుటుంబ సభ్యులు ఎవరొకరు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న సందర్భాలు కొత్తవేమీ కాదు. చాలా చూశాం.. చాలా చూస్తున్నాం. ఇందుకు ఉదాహరణలు చెప్పుకోవాలి అంటే కోకల్లలు. ప్రస్తుతం అనసూయ గురించి చెప్పుకోవాలి. ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అనసూయ కాలేజీ లో చదువుకుంటున్న రోజుల్లో నాగ సినిమాలో చిన్న సీన్ లో నటించింది.
అటు తర్వాత న్యూస్ ప్రెజెంటర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఈమె క్రేజ్ ను సంపాదించుకుంది. అటు తర్వాత బుల్లితెర పై వరుస షోల ద్వారా తన క్రేజ్ ను పెంచుకుంది. ఇదిలా ఉండగా .. అనసూయ కూడా తన ఫ్యామిలీ నుండీ మరో వ్యక్తిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతోందట. వివరాల్లోకి వెళితే అనసూయ చెల్లెలు వైష్ణవి కూడా అనసూయ లానే గ్లామర్ గా ఉంటుందట.
ఆమెకు కూడా ఇండస్ట్రీ లో రాణించాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. అనసూయ లానే వైష్ణవి కి కూడా యాంకరింగ్ పట్ల ఆసక్తి ఉంది. అందుకే తన చెల్లిని యాంకర్ గా చేయడం కోసం ఇండస్ట్రీలో తనకు తెలిసిన బుల్లితెర షో నిర్వాహకులను సంప్రదిస్తుందట. చాలామంది సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. అన్నీ కుదిరితే త్వరలోనే అనసూయ చెల్లిని కూడా త్వరలోనే బుల్లితెర పై చూడొచ్చు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!