తనని విమర్శించిన వారికి గట్టి పంచ్ ఇచ్చిన యాంకర్ అనసూయ

  • February 10, 2017 / 10:50 AM IST

అడల్ట్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన హాట్ యాంకర్ అనసూయ సినిమాల్లోనూ అప్పుడప్పుడూ కనిపిస్తూ అలరిస్తోంది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల తర్వాత ఆమె  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీలో “సుయ సుయ” అనే స్పెషల్ సాంగ్ చేసింది.  సీనియర్ యాంకర్ సుమ కనకాల పాడిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాట ప్రోమో వీడియోలో అనసూయ ఒక బార్ లో డ్యాన్స్ చేస్తూ అందాలు ఆరబోసింది. ఆ బార్ లో బుద్దుడి విగ్రహం ఉంది. ఆలా బుద్ధుడి విగ్రహం ముందు ఐటెం సాంగ్ ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో అనసూయపై విరుచుకుపడ్డారు. దీనిపై యాంకర్ హాట్ గానే స్పందించింది.

‘ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని బుద్ధ బార్‌లో చిత్రీకరించారు. ఆ బార్‌లో బుద్ధుడి విగ్రహం ముందే అందరూ తాగుతారు. మేం అక్కడ ఆ విగ్రహం పెట్టలేదు. అక్కడి వాళ్లకు బుద్ధుడి విగ్రహం ముందు తాగడం తప్పు కానప్పుడు.. మేం ఓ పాట షూట్‌ చేస్తే తప్పేంటి? ఇతరులను గౌరవించడం చేత కానివారికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు’అని విమర్శకులకు గట్టి పంచ్ ఇచ్చింది. దీంతో అనసూయ ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్క పంచ్ తో విమర్శకుల నోరు మూయించిందని చెబుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus