రామ్ చరణ్ మేనత్తగా అనసూయ

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. 1985 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత కథానాయికగా నటిస్తుండగా ఆది పినిశెట్టి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. రామ్ చరణ్ దుబాయ్ నుంచి రాగానే చివరి షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే ఇతర అంశం బయటకిరాకపోవడం విశేషం. ఇదే సినిమాలో అనసూయ కే‌యూ‌డి‌ఏ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అనసూయ రామ్ చరణ్ కు మేనత్తగా నటిస్తోందట. మేనత్త అనగానే ఏదో ఆంటీ క్యారెక్టర్ అనుకోని కంగారు పడకండి. సెక్సీ మేనత్త అన్నమాట. వరస ప్రకారం రామ్ చరణ్ మేనత్తగా అనసూయ ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఆమె గ్లామర్ తోపాటు నటన కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుందట. ఈ సినిమా తర్వాత అనసూయ సుడి తిరుగుతుందని, ఇకపై పెద్ద సినిమాల్లో మంచి ఆఫర్లు అనసూయ వెనుక క్యూ కడతాయని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. చూద్దాం మరి “రంగస్థలం”పై అనసూయ ఏమేరకు రాణిస్తుందో, రంజింపజేస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus