వై.ఎస్.ఆర్ బయోపిక్ లో కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ

  • November 13, 2018 / 10:02 AM IST

దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ ‘యాత్ర’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకి మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో మలయాళంలో మెగాస్టార్ హీరో మమ్ముట్టి నటిస్తుండగా, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఇక హీరో మమ్ముట్టి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తున్నారని, సినిమాలో హీరో మమ్ముట్టి హావభావాలు, మాటలు మళ్ళీ అందరికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేయడం ఖాయం అని చిత్ర బృందం సంతోషంలో ఉన్నారు.

ఇక ఈ బయోపిక్ లో ఒక కీలక పాత్రలో అనసూయ కనిపించబోనుంది. సినిమాలో మమ్ముట్టికి, అనసూయ కి మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అయితే అనసూయ ‘యాత్ర’ సెట్ లో ఒక ఫోటో దిగి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇలా పెట్టి పెట్టగానే వై.ఎస్.ఆర్ బయోపిక్ లో అనసూయ నటిస్తుందనే విషయం తెలియడంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి ఈ బయోపిక్ లో అనసూయ ఎవరి క్యారెక్టర్ చేయబోతుంది, తన క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరొకొన్ని రోజులు ఓఫిక పట్టక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus