వైరల్ : రష్మీకి బెదిరింపులు..!

బుల్లితెర ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది హాట్ యాంకర్ రష్మీ. ఈ షోలో పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ కుర్రకారుని హీటెక్కిస్తుంటుంది. ఇక సినిమాల్లో హీరోయిన్ గానూ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ట్విట్టర్లో ఓ వ్యక్తి రష్మిని బెదిరిస్తూ… చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే… సాయి ప్రణీత్ చౌదరి అనే వ్యక్తి ట్విట్టర్లో త్వరలో రష్మీ రాసలీల వీడియోను పోస్ట్ చేస్తానంటూ ట్వీట్ చేసాడు. ఈ విషయం పై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్మీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “ఇలాంటి చెత్త వ్యాఖ్యలను నేను పట్టించుకోను. నా గురించి ఏం పోస్ట్ చేయాలనుకుంటే అది పోస్ట్ చేసేయ్ – నేను వాటి గురించి పట్టించుకోను… నేను ఏ తప్పు చేయలేదు” అంటూ బదులిచ్చింది. అయితే రష్మీ ఫ్యాన్ ఒకరు… దయచేసి ఆ ట్వీట్ ను డిలీట్ చేసెయ్యి భయ్యా – నీకు దండం పెడతానంటూ… రిక్వెస్ట్ చేశాడు. దీని పై కూడా రష్మీ స్పందిస్తూ .. “ఆ వ్యక్తి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సినవసరం లేదండి – జస్ట్ అతడిని ఫాలో అవ్వడం మానేయండి… ” అంటూ చెప్పింది. అయితే సాయి ప్రణీత్ విడుదల చేస్తానన్న వీడియో ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే… ఇది కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ మరికొందరు చెప్పుకోస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus