మైమరిచి డ్యాన్సులు చేసిన యాంకర్ శ్యామల

  • November 23, 2016 / 12:26 PM IST

టీవీ ఫిమేల్ యాంకర్లు రెండు రకాలు. సంప్రదాయ దుస్తులు వేసుకుని, చక్కగా మాట్లాడుతూ, స్పాంటేనియస్ తో నవ్వులు పూయించే వర్గం ఒకటయితే.. పొట్టి బట్టలతో, ముద్దు ముద్దు మాటలతో హొయలొలికించే వారు మరో వర్గం. మొదటి కేటగిరీకి చెందిన శ్యామల బుల్లి తెరపై మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మహిళల్లో ఫాలోయింగ్ పెంచుకుంది. అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తోంది. ఏమైందో ఏమో గానీ రీసెంట్ గా జరిగిన పార్టీలో మైమరిచి డ్యాన్సులు చేసింది. ఇంతకీ ఆ పార్టీ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారా?,  శ్యామలనే.  తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చింది.

అందులో ఉత్సాహంగా డ్యాన్సులు చేసింది. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. గతంలో ఎప్పుడూ జరగనంత స్థాయిలో గ్రాండ్ గా పుట్టిన రోజు జరుపుకున్నానని, తన లైఫ్ లో ఈ బర్త్ డేను  ఎప్పటికీ మర్చిపోనని చెప్పింది. ఈ చిత్రాలను చూసిన సినీ జనాలు మాత్రం “హోమ్లీ పాత్రలు పోషించి శ్యామలకు బోరు కొట్టినట్లు ఉంది. తోటి యాంకర్లకు వస్తున్నట్లు స్టార్ హీరోలతో ప్రత్యేక గీతాల్లో డ్యాన్స్ చేసే అవకాశం రావాలని ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేస్తోంది” అని చెప్పుకుంటున్నారు. మరి హోమ్లీ యాంకర్ మనసులో ఏముందో..!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus