తన మాటలతో హీరోయిన్ ని బాధపెట్టిన యాంకర్ సుమ

  • May 6, 2017 / 09:36 AM IST

బుల్లి తెర స్టార్ మహిళా సుమ స్క్రిప్ట్ లేకుండా మూడు గంటల కార్యక్రమాన్ని అయినా నడిపించగలదు. తన మాటలతో కదలకుండా కూర్చోబెట్టేస్తుంది. స్కిన్ షో, డబల్ మీనింగ్ మాటలకూ దూరంగా ఉంటూ ఎక్కువకాలం టీవీ రంగంలో ఏలుతున్న సుమ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో శృతి మించింది. హద్దుమీరి వేసిన పంచ్ ఎదుటివారికి బాధని కలిగించాయి. అసలు విషయంలోకి  వెళితే.. అవసరాల శ్రీనివాస్ నటించిన  ‘బాబు బాగా బిజీ’ మూవీ నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రచారంలో బాగా ‘బాబు బాగా బిజీ’ టీమ్ సుమ తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.

ఇందులో ఒక హీరోయిన్ గా నటించిన మిస్తీ చక్రవర్తితో సుమ మాట్లాడుతూ ‘నీ పేరు ముష్టినా’ అని అడిగింది. సరదాగా అందరూ నవ్వుకుంటారని సుమ ఆ ప్రశ్న వేసింది. అనుకున్నట్టే అందరూ తెగ నవ్వుకున్నారు. కానీ మిస్తీ చక్రవర్తి మాత్రం చాలా బాధపడిందంట. ఆమె హార్ట్ అయినా సంగతిని తెలుసుకున్న సుమ, షో అయిన తర్వాత ఆమెకు సారీ చెప్పినట్లు సమాచారం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus