టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన 25 వ చిత్రం ‘మహర్షి’ తరువాత.. సుకుమార్ డైరెక్షన్లో తన 26 వ చిత్రాన్ని చేయబోతున్నాడని అంతా భావించారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం మహేష్.. సుకుమార్ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం.. సుకుమార్ చెప్పిన లైన్ కి మహేష్ ఓకే చెప్పినప్పటికీ.. ఫుల్ స్క్రిప్ట్ విన్నాక మహేష్ అంతగా సంతృప్తి చెందలేదంట. ఇప్పటికే సుకుమార్ ని పది సార్లు వరకూ తిప్పించాడంట మహేష్. సుకుమార్ కూడా మహేష్ ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా.. కథ రాసుకోవడానికి తన టీంతో విదేశాలకి కూడా వెళ్ళొచ్చాడంట సుకుమార్, అయినప్పటికీ మహేష్ ని ఒప్పించడంలో నిరాశే ఎదురయ్యిందని చెప్పాలి. దీంతో మరో 6 నెలలు టైం అడిగాడట సుకుమార్. మహేష్ కూడా ఇందుకు అంగీకరించాడట.
దీంతో ఇప్పుడు ‘మహేష్ 26’ ను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మర్చి నుండీ ‘మహర్షి’ ప్రమోషన్లు మొదలవుతాయి… ఇక ఏప్రిల్ నాటికి ‘మహర్షి’ చిత్రం రిలీజ్ అయిపోతుంది కాబట్టి, వెంటనే ఫ్యామిలీతో విదేశాలకి టూర్ కి వెళ్లి వచ్చిన వెంటనే.. అనీల్ రావిపూడితో చేయబోయే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని మహేష్ భావిస్తున్నాడట. అనీల్ స్క్రిప్ట్ కూడా ఓకే అయిపొయింది కూడా. రీసెంట్ గా ‘ఎఫ్ 2′ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఏకంగా మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడన్న మాట. ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని మహేష్ కి చెప్పాడట అనిల్. ఈ చిత్రాన్ని మహేష్ బాబే స్వయంగా నిర్మస్తాడని కొందరు చెప్తుంటే.. సహా నిర్మాతలుగా ’14 రీల్స్ ప్లస్’ లేదా ఠాగూర్ మధు వ్యవహరిస్తారని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.