పవర్ స్టార్ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్

  • October 8, 2016 / 11:31 AM IST

ఐదేళ్ల క్రితం కుర్రకారుని ఓ ఊపు ఊపిన పాట ‘వై దిస్ కొలవరి డీ’. థ్రిల్లర్ మూవీ “3 ” కోసం ధనుష్ ఈ సాంగ్ ని ఆలపించారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేసిన “కొలవరి డీ” యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఒక్క పాటతో ధనుష్ కి, అనిరుద్ కి ఎనలేని గుర్తింపు లభించింది. మ్యూజిక్ డైరక్టర్ కి ఎన్నో అవకాశాలు తెచ్చి పెట్టింది ఈ పాట. అప్పటి నుంచి టాలీవుడ్ దర్శకులు ఎంతోమంది అనిరుద్ ని తెలుగులో పరిచయం చేయాలనీ ప్రయత్నించారు, కానీ కుదరలేదు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “అ..ఆ” సినిమాకు మొదట అనిరుద్ నే తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల చివరి నిముషంలో మిక్కీ జె మేయర్ రీ ప్లేస్ అయ్యారు. ఈసారి ఎలాగైనా మిస్ చేయకూడదని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న కొత్త సినిమాకు అనిరుద్ ని మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేశారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  “దేవుడే దిగివచ్చినా” టైటిల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. నవంబర్లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ఫిల్మ్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ విరామం లేకుండా సాగుతున్నాయి.  పవన్ కళ్యాణ్ కోసం అనిరుద్ కంపోజ్ చేసే పాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus