చిరు 150వ సినిమా విలన్ ఎవరో తెలుసా???

Advertisement

ఒకటి కాదు…రెండు కాదు, దాదాపుగా 10ఏళ్ల తరువాత ఎన్నో రాజకీయ ఇక్కట్లను ఎదుర్కుని మళ్లీ మెగాస్టార్ మన టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా చిరు తీస్తున్న 150వ చిత్రం కోసం అశేష మెగా అభిమానులు ఆశగా, ఆరాటంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఎంత భారీగా అంచనాలు ఉన్నాయో ఈ సినిమా మీద అంతే పేలవంగా సాగుతుంది ఈ సినిమా షూటింగ్.

అసలైతే ఈ సినిమా షూటింగ్ శేరవేగంగా సాగిపోతూ ఉండాలి కానీ, అనేక ఇబ్బందుల వల్ల ఈ సినిమా షూటింగ్ చాల్ స్లో గా సాగి…పోతూ ఉంది. తొలుత ఈ సినిమాకు హీరోయిన్స్ వల్ల అనేకే ఇబ్బందులు వచ్చాయి. ఎందరో హీరోయిన్స్ కోసం వెతికి వెతికి…చివరకు ఎవరినో సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. అయితే అఫీషియల్ గా అయితే ఇంకా ఎవరికీ తెలీదు. అదే క్రమంలో ఇప్పుడు సినిమాలో విలన్ వంతు…విషయం ఏమిటంటే….దాదాపుగా రెండు షెడ్యూల్స్ అటు హీరోయిన్, ఇటు విలన్ లేకుండా పూర్తి చేసిన షూటింగ్, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విలన్ ఉండాల్సి ఉంటుంది.

అయితే అదే క్రమంలో ఈ సినిమాలో విలన్ గా గతంలో జగపతిబాబు పేరు అనుకున్నారు. ఆ తరువాత నీల్ నితిన్ ముకేష్, వివేక్ ఒబరాయ్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చివరకు వీళ్ళ అందరినీ కాదు అని  ఫైనల్ గా అంజలా ఝవేరి మొగుడు తరుణ్ అరోరా కే ఫిక్స్ అయ్యాడు చిరు. ప్రస్తుతం అంజలా ఝవేరీ భర్త మోడలింగ్ ఫీల్డ్ తో పాటు… బాలీవుడ్ లో కూడా కొనసాగుతున్నాడు. జబ్ వియ్ మెట్ తో పాటు మరెన్నో సినిమాల్లో నటించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus