సొగసులు ఆరబోస్తున్న మరో హెగ్డే బ్యూటీ

  • January 2, 2018 / 10:41 AM IST

టాలీవుడ్ లో 2018 లో కూడా కొత్త భామలు వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇతర భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ గర్ల్స్ టాలీవుడ్ ని కూడా హీటెక్కించాలని సిద్ధమవుతున్నారు. అయితే మొదట ఎవరు వచ్చినా కూడా అందరి ద్రుష్టి ఈ సమ్మర్ కి వచ్చే సంయుక్త హేగ్దే పైనే ఉంటుందేమో. ఎందుకంటే ఈ బ్యూటీ ఎంత హాటో సోషల్ మీడియాలో ఆమె కథలికలను గమనిస్తే అర్ధమవుతోంది. కన్నడలో “కిరిక్ పార్టీ” అనే సినిమా ద్వారా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సంయుక్త మొన్నటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరికి తెలియదు. కానీ ఎప్పుడైతే నిఖిల్ సినిమాలో సెలెక్ట్ అయ్యిందో అప్పటి నుంచి కొంచెం కొంచెంగా ఫెమస్ అవుతూ వస్తోంది.

అందుకు కారణం ఆమె ఫొటోలే. రీసెంట్ గా శ్రీలంక ట్రిప్ లో అమ్మడు ఇచ్చిన ఒక స్టిల్ ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆల్రెడీ టాలీవుడ్ లో ఒక హెగ్డే బ్యూటీ అదేనండీ మన పూజా హెగ్డే “డీజే” సినిమాలో నడుమందాలతో, బికినీ పరువాలతో టెంపరేచర్ పెంచగా.. ఇప్పుడు సంయుక్త హెగ్డే ఆమెకు తోడుగా ఆమెను మించిన స్థాయిలో అందాల ఆరబోతతో పెచ్చిక్కిస్తోంది. ఇకపోతే.. సంయుక్త హెగ్డే పూర్తి స్థాయి అందాలను ఆస్వాదించాలంటే.. “కిరాక్ పార్టీ” తెలుగు రిలీజ్ డేట్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus