Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

ఇటీవల ఎవ్వరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై చాలా హర్ట్ అయ్యారు. వారు ఇలా విడిపోవడానికి గల కారణాలు ఇంకా బయటకు రాలేదు. దీంతో బయట ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెప్పుకుంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ అయితే ‘పవన్ వుమనైజర్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది వేరే అమ్మాయితో పవన్ రిలేషన్‌లో ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే, పవన్ కళ్యాణ్‌కు కేంద్రం పెద్ద పదవిని కట్టబెట్టబోతోందని.. అందుకే ఫ్యామిలీ రిలేషన్స్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.

Pawan Kalyan

సరే ఆ విషయాలు పక్కన పెడితే.. పవన్ మాత్రమే కాదు, ఇంకొంతమంది సెలబ్రిటీలు కూడా విడాకుల బాట పట్టినట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన నిర్మాత సైతం విడాకులు తీసుకున్నట్టు ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఆ లిస్టులో మరో హీరో కూడా ఉన్నాడట. అతను ఇటీవల ట్విట్టర్‌లో తన భార్యతో విడిపోయినట్టు డైరెక్ట్‌గానే ట్వీట్ చేశాడట. కానీ కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడట.

దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. త్వరలో ఈ హీరో నటించిన ఒక సినిమా రిలీజ్ కాబోతోంది. దీని ప్రమోషన్స్ కోసం కచ్చితంగా అతను మీడియా ముందుకు రావాల్సిందే. ఆ ట్వీట్ గనుక అలాగే ఉంచితే, మీడియా నుంచి గట్టిగా ప్రశ్నలు ఎదురవుతాయి. అప్పుడు సినిమా టాపిక్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. అందుకే ట్వీట్ డిలీట్ చేయాల్సిందిగా మేకర్స్ కోరినట్టు ఇన్‌సైడ్ టాక్.

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus