ఆలీ…సుమ విభేదాలపై మరో ట్విస్ట్!!!

  • February 16, 2016 / 10:37 AM IST

అలీ ఇప్పటికీ టాలీవుడ్ లో మంచి కమీడియన్ గా దూసుకుపోతున్నాడు, ఇక సుమ గురించి చెప్పాలి అంటే ‘టాప్ యాంకర్ ఆఫ్ టీవీ ఇండస్ట్రీ’ అని టక్కున చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరూ కలసి ఎన్నో సార్లు కామెడీ పండిస్తూ ఆంకరింగ్ చేశారు. అందులో మాటీవీ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మాటీవీ అవార్డ్స్’ ముఖ్యమైనవి. ఇదిలాఉంటే ఈ మధ్య అలీ కి, సుమకి మధ్య కొంత మాటల యుద్దం జరిగింది అని, ఆలీ మాటలకు సుమ బాధపడి, ఒక ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయింది అని, అంతేకాకుండా స్టేజ్ వెనుక అలీకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత అదంతా కేవలం ట్రాష్, అన్నీ మీడియా సృష్టించినవే అంటూ న్యూస్ కూడా వచ్చింది. ఇంతవరకూ భాగానే ఉంది కానీ, గొడవ జరిగిన సంధర్భం నుంచి వాళ్ళిద్దరూ మళ్లీ కలసి స్టేజ్ పై, ఆంకరింగ్ చేసిన ధాకలాలు అయితే కనిపించలేదు. ఇక అలా కనిపించకపోవడంతో వాళ్ళిద్దరి గొడవ నిజమే అంటూ టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరో పక్క ఆ వాదనలకు బలం చేకూరుస్తూ మాటీవీ వారు ప్రతీ ఏడు నిర్వహించే మాటీవీ అవార్డ్స్ స్పూఫ్ షూట్ లో అలీని పక్కన పెట్టడం. గత ఏడాది, మగధీరా, బాహుబలి, ఇలా రెండు కామెడీ స్పూఫ్స్ చేసిన అలీ..సుమ, ఇప్పుడు కలసి చేయడం లేదు, ఈసారి అలీని పక్కన పెట్టి, పృధ్వి, సంపూర్నెష్ బాబు ఇలా వీళ్ళిద్దరితో కాలిసి, సుమ స్పూఫ్ లో నటించినట్లు సమాచారం. ఏది ఏమైనా….విషయం చాలా పెద్దది అనే తెలుస్తుంది, లేదంటే అలీని ఎందుకు పక్కన పెడతారు. చూద్దాం, ఏం జరుగుతుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus