అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా సెట్స్ లో రచ్చ

  • July 27, 2019 / 12:31 PM IST

అల్లు అర్జున్ 19వ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ స్పాట్ లో సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ కి జరిగిన గొడవ సంగతి తెలిసిందే. ఆ గొడవలో దర్శకుల సంఘం ఇన్వాల్వ్ అవ్వడం.. బన్నీ చేత సారీ చెప్పించడం కూడా జరిగిందని అప్పట్నుంచి త్రివిక్రమ్-బన్నీల నడుమ రిలేషన్ దెబ్బ తిన్నదని షూటింగ్ స్పాట్ లో వారు సరిగా మాట్లాడుకోవడం లేదని.. ఇది వారిద్దరి కాంబినేషన్ లో జరుగుతున్న మూడో సినిమా అయినప్పటికీ.. వాళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు ఉన్నంత రేపో కనిపించడం లేదు.

పైగా.. అల్లు అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా షూటింగ్ ముగించమంటున్నాడని కూడా వినికిడి. నిజానికి క్లైమాక్స్ అనేది పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వకుండానే.. కేవలం “నా పేరు సూర్య” అనంతరం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి త్రివిక్రమ్ సినిమాను అర్జెంట్ గా మొదలెట్టాడు అల్లు అర్జున్ అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో అల్లు అర్జున్ 19వ మరో బ్రహ్మోత్సవంలా మారాబోతోందని కూడా మెన్షన్ చేశారు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఇలా జరుగుతుందేంటి అని భయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus