పవన్ కళ్యాణ్ ను నమ్ముకొన్న అందాల భామ

  • January 9, 2018 / 02:35 PM IST

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ రేపు భారీ క్రేజ్ నడుమ అట్టహాసంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన అను ఇమ్మాన్యుయేల్ కు ఇదే మొదటి బడా చిత్రం కావడంతో దీనిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారామె. ఈ చిత్రం గనుక ఘన విజయాన్ని అందుకుంటే ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోవడం ఖాయం. అందుకే కష్టపడి తెలుగు కూడా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పింది అమ్మడు. త్రివిక్రమ్ కావాలనే ఆమెను హైలైట్ చేశాడో లేక సినిమాలో ఆమె క్యారెక్టర్ అలాంటిదో తెలియదు కానీ కీర్తి సురేష్ కంటే అనుకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇంకోపక్క గ్లామర్ పరంగానూ అను ఎమ్మాన్యూల్ మెయిన్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ను డామినేట్ చేసి పడేసింది. ఇక తన కో స్టార్ పవన్ గురించి మాట్లాడిన ఆమె ఆయనొక ప్రత్యేక వ్యక్తి అని, ఎంతో క్రేజ్ ఉన్నా చాలా సాధారణంగా ఉంటారని, షూట్ లేకపోతె స్టేట్స్ లో రిలాక్స్డ్ గా ఉంటారని, ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువని, ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని పవన్ గురించి చెప్పుకొస్తోంది. చూద్దాం మరి ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుల్ కెరీర్ గ్రాఫ్ ఏమేరకు పెంచుతుందో చూడాలి మరి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతలా అయితే తమ హీరో సినిమాని చూడాలని ఎగ్జయిట్ మెంట్ తో ఉన్నారో.. అదే విధంగా అను ఎమ్మాన్యూల్ కూడా తనకు స్టార్ గ్రాఫ్ ఎలా మారుతుందో అనే ఉత్సాహంతో రిలీజ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus