రెండు భారీ ప్రాజెక్ట్స్ కోల్పోయిన అను ఇమ్యానుయేల్

  • January 20, 2018 / 08:16 AM IST

విజయం.. అపజయం.. తేడా రెండు అక్షరాలే. కానీ వాటి వల్ల వచ్చే మార్పు రెండు పేజీలు రాసిన సరిపోదు. సినిమా పరిశ్రమలో వీటి మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. హిట్ వస్తే లక్కీ హ్యాండ్ అని.. ఫ్లాప్ వస్తే ఐరన్ లెగ్ అని ట్యాగ్ తగిలించడం ఇక్కడ సర్వ సాధారణం. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజక్ట్ అజ్ఞాతవాసిలో ఛాన్స్ అందుకోగానే అను ఇమ్యానుయేల్ ని అందరూ లక్కీ గర్ల్ అన్నారు. ఆ సినిమా పూర్తి కాకుండానే నిర్మాతలు క్యూ కట్టి డేట్స్ తీసుకున్నారు. ఆమె చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” చిత్రంతో పాటు, నాగ చైతన్య “శైలజారెడ్డి అల్లుడు” సినిమాలు ఉన్నాయి. ఈ రెండూ సెట్స్ పైన ఉన్నాయి. అయితే అజ్ఞాతవాసి రిలీజ్ కాకముందు మరో రెండు సినిమాలు అను ఖాతాలో ఉండేవి .

బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబో మూవీ, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కనున్న చిత్రాల్లో హీరోయిన్ గా అను ఇమ్యానుయేల్ ను అనుకున్నారు. సంతకాలు మాత్రమే బ్యాలెన్స్. అజ్ఞాతవాసి ఫలితం తారుమారు కావడంతో అవకాశాలు కూడా అనుకు ఆమడదూరం పారిపోయాయి. నిన్నమొదలైన చరణ్ సినిమాలో హీరోయిన్ గా అనుని తొలిగించి బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకున్నట్టు తెలిసింది. అలాగే వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఎన్టీఆర్ సినిమాలో కూడా కొత్త భామ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో త్రివిక్రమ్ కూడా అను ఇమ్యానుయేల్ కి ఎటువంటి హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు టాక్. మొత్తానికి అజ్ఞాతవాసి ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ మీద మాత్రమే కాదు అను మీదా కూడా బాగా పడిందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus