ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న అను

  • October 29, 2018 / 06:13 AM IST

సాధారణంగా హీరోయిన్ల కెరీర్లు సక్సెస్ మీద లేక పరిచయాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ రెండిట్లో అను ఎమ్మాన్యూల్ ఎందులో స్ట్రాంగ్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. అమ్మడు నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు సూపర్ హిట్ అవ్వకపోయినా మరీ క్యూ కట్టకపోయినా.. ఒకదాని తర్వాత ఒక సినిమాతో కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. అయితే.. “అజ్ణాతవాసి” సినిమాతో మెగా కాంపౌండ్ హీరోయిన్ మార్క్ సొంతం చేసుకొన్న అను ఎమ్మాన్యూల్ ఆ తర్వాత ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య” సినిమా సైన్ చేసి మెగా హీరోయిన్ అనిపించుకొంది.

కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి అడుగిడనుంది అను ఎమ్మాన్యుల్. వరుణ్ తేజ్ హీరోగా “అప్పట్లో ఒకడుండేవాడు” ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలో రూపొందనున్న చిత్రంలో కథానాయికగా అను ఎమ్మాన్యూల్ కథానాయికగా ఎంపికైందని సమాచారం. హిస్టారికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ రెట్రో లుక్ లో కనిపించడం ముఖ్యం కావడం, ఆ రెట్రో లుక్ లో శారీలో అను ఎమ్మాన్యుల్ అయితే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus