కాంట్రవర్సీ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ బాటలోనే అతని హీరోయిన్ నడుస్తోంది. విజయాల కంటే వివాదాల తోనే వార్తల్లో ఉండేందుకు తహతహ లాడుతోంది. ఇంతకీ ఆ అందాల భామ ఎవరు అనుకుంటున్నారా ? .. వివరాల్లోకి వెళితే .. కొన్ని నెలల క్రితం వర్మ “శ్రీదేవి” పేరుతో ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సినిమాకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా విడుదల చేశారు.
అందులో పిల్లవాడికి ఒంపుసొంపులతో పిచ్చెక్కించే భామ స్టిల్స్ ఇచ్చిన ముద్దుగుమ్మ పేరు అనుకృతి. ఈ పోస్టర్ల పై అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో శ్రేదేవి సినిమాను వర్మ పక్కన పెట్టారు. సినిమా ఆగిపోతేనేమి అనుకృతికి అవకాశాలు తలుపు తట్టాయి. తెలుగులో లో బడ్జెట్ శృంగార మూవీ “పాప” కి ఆమె సైన్ చేసింది. యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమైంది. సడెన్ గా ఈమె షూటింగ్ నుంచి బయటికి వచ్చేసింది. దర్శకుడు తనని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నాడని, డైలాగులు కూడా ఛండాలంగా ఉన్నాయని అనుకృతి ఆరోపించింది.
తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానని, షూటింగ్ చేసిన ఫుటేజ్ మొత్తం తనకి ఇప్పించమని పోలీసులను ఆశ్రయించింది. డైరక్టర్ యోగి వెర్షన్ మరోలా ఉంది. అనుకృతి సినిమాకు సైన్ చేసేముందు, ఆమెకు చూపించిన స్క్రిప్ట్ ప్రకారమే షూటింగ్ చేస్తున్నానని, ఇప్పుడు తన చిత్రానికి సహకరించక యూనిట్ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోందని పోలీస్ స్టేషన్లో వాపోయాడు. ఆమె ఓ ముదురు హీరోతో ప్రేమలో ఉందని, అతను చెప్పిన ప్రకారమే ఇలా చేస్తోందని వెల్లడించాడు. ఇంతకీ పాప కథ ఎంతవరకు పోతుందో?